230
ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థనచేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను. లూకా Luke 22:44
- నిందలెల్ల ఏకముగా - మహామహునిమీద బడగా
వింతగానే యోర్చుకొనెను - తండ్రి మాట నేరవేర్చెన్ || యేసుని ||
- దుఃఖముతో నిండియుండెన్ - ప్రక్కలోన గ్రుచ్చబడెను
రక్తితోడయోర్చుకొని వి - రక్తి మాట పల్కకుండెన్ || యేసుని ||
- శోకంబు చెత నేను - నాకంబు కదిలింతును
రక్తంబుధార పోసెన్ - రిక్తులమైన మనకు || యేసుని ||
- సదయుని రక్తముచే - హృదయాలంకారముచే
కలుగు నాహారమిదే - ఎల్లరకు శ్రేష్టాహారం || యేసుని ||
- తల్లి ప్రేమకన్న మిగుల - తన ప్రేమ చూపె మనకై
నోటి మాటతోడ శత్రున్ - కోటల నశింపజేసెన్ || యేసుని ||
- నా యేసు రక్తచెమట - నాయప్పు యంతయున్ తీర్చెన్
ఎల్లరికి నగీకారమిదే - ఎల్లప్పుడు నా ధ్యానమున్ || యేసుని ||
- హల్లెలూయా గీతమును - ఎల్లపుడు చాటుచుందున్
ఎల్లరియందు తానే - ఎల్లప్పుడు వసించున్ || యేసుని ||
అను పల్లవి: ఇతని ఓదార్పు నిజము - ఇతర ఓదార్పు వృథయే