యెహోవా నీ కృపాతిశయమును

"నీ మందిరము యొక్క సమృద్ధివలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు." కీర్తన Psalm 36:8


    పల్లవి : యెహోవా నీ కృపాతిశయమును - నిత్యము కీర్తింతున్
    1. తరతరములకు నీ విశ్వాస్యత - తెలియపరచెదను
    కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి
    పాపము క్షమియించె (2)
    || యెహోవా ||
    2. ప్రతిశోధనపై నీవు నాకు - విజయము నిచ్చెదవు
    నన్ను విడిపించుటకు నీవు - నమ్మతగిన వాడవు
    || యెహోవా ||
    3. నీదు వాత్సల్యము నాపై - నూతనముగా నుండున్
    నీదు విశ్వాస్యత గొప్పదై - మారనిదై యుండున్
    || యెహోవా ||
    4. నీదు రాకడ వరకు నన్ను - నిందా రహితునిగా
    నమ్మకమైయున్న నా ప్రభువా - నన్ను కాచెదవు
    || యెహోవా ||
    5. మంచి పోరాటము పోరాడి - జయమును పొందెదను
    మహిమ మకుటము నిచ్చెడు ప్రభువునకు
    హల్లెలూయ పాడెదను
    || యెహోవా ||

    About Online Lyrics List

    పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం